నవపక్షం, మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బాలకృష్ణయ్య–కృష్ణమ్మ దంపతుల కుమార్తె చిట్టెల గాయత్రి ఆల్ ఇండియా NEET ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి MBBS సీటు సాధించిన సందర్భంగా ఆమెను BRSV రాష్ట్ర కార్యదర్శి డా. కొండ గణేష్ ఘనంగా సన్మానించారు.
రామంతాపూర్ చెరువుకట్ట వద్ద డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గాయత్రిని శాలువాతో సత్కరించి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. కొండ గణేష్ మాట్లాడుతూ, ప్రతిభ ఎవరి సొత్తు కాదని, కులం ప్రతిభకు అడ్డంకి కాదని, కష్టపడి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. గాయత్రి సాధించిన విజయం ఇందుకు నిదర్శనమని, ఇది మన జాతికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు గాయత్రి ఆదర్శంగా నిలిచారని అన్నారు.
గాయత్రి MBBS విద్యను విజయవంతంగా పూర్తి చేసి, ఉన్నత చదువులు అభ్యసించి పేద, బడుగు వర్గాల ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అలాగే గాయత్రి MBBS విద్య పూర్తయ్యే వరకు తన వంతు సహకారం అందిస్తానని ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా చిట్టెల గాయత్రిని ఘనంగా సన్మానించి, ఆమెకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.


