డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణకు డిమాండ్… తహసీల్దార్‌కు తక్కెళ్లపహాడ్ గ్రామస్థుల వినతిపత్రం

నవపక్షం, శాలిగౌరారం:

శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామంలో  డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుతో పాటు గతంలో తమకు కేటాయించిన ప్లాట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్థులు శాలిగౌరారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం 2003–04 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామంలోని నిరుపేదలకు ఒక్కొక్కరికి 150 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం 2013 నుంచి 2017 వరకు సర్పంచ్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ పథకం కింద గ్రామానికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.

అయితే, గతంలో తమకు కేటాయించిన ప్లాట్లలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం చేపట్టే సమయంలో తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆ సమయంలో అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు, అర్హత లేని వారికి గతంలో కేటాయించిన ప్లాట్లు అందిస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

ప్రస్తుతం డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అర్హత కలిగిన కొందరికి ఇళ్లు దక్కలేదని, తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇళ్లు కేటాయించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ నేపథ్యంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియ, లబ్ధిదారుల అర్హతలు, గతంలో ప్లాట్ల కేటాయింపునకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి విచారణ జరిపించాలని గ్రామస్థులు తహసీల్దార్‌ను కోరారు. అర్హత కలిగిన నిరుపేదలకు నిబంధనల ప్రకారం డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించడంతో పాటు, గతంలో తమకు కేటాయించిన ప్లాట్లపై కూడా న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Hot this week

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Topics

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.