నవపక్షం, చిట్యాల ప్రతినిధి :
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్న మధుకర్ జీ ని బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, అడ్వకేట్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలోని ఆర్గానిక్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్తున్న సందర్భంగా చిట్యాలకు విచ్చేసిన మధుకర్ జీ ని బీజేపీ నాయకులు కలిసి నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరికంటి మొగులయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహ, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి, చిట్యాల బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మోస శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, జయరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గంజి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మధుకర్ జీ గారి నాయకత్వంలో తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు.


