నవపక్షం, మండపేట ప్రతినిధి :
మండపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి విజయభేరి మోగించేందుకు కూటమి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి వేగుళ్ళ అజయ్ కుమార్ సిద్ధమయ్యారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ఎలక్షన్ ఇన్ఛార్జ్ దేవినేని ఉమా మహేశ్వరరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి చేతుల మీదిగా సోమవారం వేగుళ్ళ అజయ్ కుమార్ కు అధికారిక ‘బి-ఫారం’ను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, అమలాపురం పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగబాబు, సిరింగి ఈశ్వరరావు, మల్లిపూడి బాబ్బి తదితరులు పాల్గొన్నారు.


