నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి :
మద్నూర్ మండల పరిధిలోని అవల్ గావ్ గ్రామంలో మండల స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ పర్యటించి, ప్రభుత్వ పథకాల కింద నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, ఇంకుడు గుంతల నాణ్యతా ప్రమాణాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడమే లక్ష్యమని తెలిపారు. ఇంకుడు గుంతల ఏర్పాటుతో వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాన్య బాయి, ఉపసర్పంచ్ విజయ్, పంచాయతీ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు బాలరాజు, ఖండు, మాజీ ఎంపీటీసీ సాయిలు, నాయకులు శంకర్ కీసర్, వార్ యాదవ్ రావు తదితరులు పాల్గొన్నారు.


