నవపక్షం, మండపేట ప్రతినిధి :
మండపేట మున్సిపాలిటీ 11వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గునిపే శ్యామ్ సుందర్ రావు విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టాభి రామన్న గురువారం వార్డులో విస్తృతంగా పర్యటించి, శ్యాంసుందర్‌రావు గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ, స్థానిక ప్రజలతో పట్టాభి రామన్న స్వయంగా మాట్లాడారు. మీకు రెండు ఓట్లు ఉంటాయి; ఒక ఓటు చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రాముకి, మరొక ఓటు కౌన్సిలర్ అభ్యర్థి శ్యామ్‌కి ఓటు వెయ్యాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ముఖ్యంగా మండపేట పట్టణ అభివృద్ధికి పార్టీ చేసిన, చెయ్యబోయే పనులను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డు రూపురేఖలు మారాలన్నా, స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలన్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామసుందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కనికెళ్ల పల్లవి ప్రసాద్, విప్పర్తి సింహాచలం, సన్యాలధనరాజ్, పోలమల సత్తిబాబు, గునిపే ఉదయ భాస్కర్ (భాను), వార్డు ప్రజలు, మహిళలు, యువకులు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.


