నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి :
TRS పార్టీ రాష్ట్ర సోషల్ & డిజిటల్ మీడియా జాయింట్ సెక్రటరీగా మరియు సూర్యాపేట జిల్లా TRS పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నలబోలు మాధవి సైది రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆమెను ఈ రెండు కీలక పదవుల్లో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ బలోపేతానికి, మహిళల హక్కుల పరిరక్షణకు, మహిళా సాధికారతకు కృషి చేయడంతో పాటు, సోషల్ డిజిటల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాధవి సైది రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.
తనపై నమ్మకంతో రెండు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితకు మాధవి సైది రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, మహిళా విభాగం బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
మాధవి సైది రెడ్డి నియామకం పట్ల పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


