నవపక్షం, రాజమహేంద్రవరం ప్రతినిధి :
రాజమహేంద్రవరం జిల్లా అడ్మిన్ ఎస్పి శ్రీ దేవరాజ్ మనీష్, IPS గారు పసలపూడి బైపాస్ ను విజిట్ చేసి బైపాస్ లో భారీగా చెట్లు కూలి రోడ్డుకు అంతరాయం కలగడంతో చెట్లు తొలగించే పనిని చూసి, ఈరోజు వర్షాలు ఉండే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు . వారి వెంట మండపేట రూరల్ సీఐ పి దొర రాజుగారు ఉన్నారు. పసలపూడి బైపాస్ నందు సుమారు 30 చెట్ల వరకు రోడ్లపై పడి ట్రాఫిక్ అంతరాయం కలగగా పోలీస్ శాఖ, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల సమన్వయంతో రోడ్లపై ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. రెండు కిలోమీటర్ల మేర రోడ్డుపై పడిన చెట్లు తొలగించడానికి సుమారు మూడు గంటలపాటు సమయం పట్టింది


