నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కిరణ్ గౌడ్ (లడ్డూ) నియమితులయ్యారు. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం, సంస్థాగత కార్యక్రమాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ పార్టీ నాయకత్వం ఈ బాధ్యతలను అప్పగించింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ డిజిటల్ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడం, సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువ కావడం, పార్టీ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించడం వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.
ఈ సందర్భంగా కిరణ్ గౌడ్ (లడ్డూ) మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, సీనియర్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో, క్రమశిక్షణతో నిర్వహిస్తానని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలు, పార్టీ విధానాలు, సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు


