నవపక్షం, దేవరకొండ ప్రతినిధి:
DVK మండలం కొండభీమనపల్లిలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య (VO) భవనాన్ని ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మహిళా సాధికారతే ప్రజాస్వామ్య లక్ష్యమని పేర్కొన్నారు.
గిరిజా నగర్ తండాలో లబ్ధిదారులైన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరుపాక సురేష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.


