నవపక్షం, హైదరాబాద్:
ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రగతి ఫౌండేషన్ జాతీయ చైర్మన్ మరియు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఆరిఫుద్దీన్ కల్వకుర్తి (OU), ప్రగతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీష తదితరులు పాల్గొని మంత్రివర్యులకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆరిఫుద్దీన్ మాట్లాడుతూ, డాక్టర్ వాకిటి శ్రీహరి సుమారు 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో, ప్రజాసేవలో విశేష అనుభవం కలిగి ఉన్నారని, తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు


