నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి :
సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, గత దశాబ్ద కాలంలో సిద్దిపేట సాధించిన అభివృద్ధిని తన వీడియో ద్వారా అద్భుతంగా ఆవిష్కరించిన కేసీఆర్ తాలూకా వ్యవస్థాపకురాలు కళ్యాణి యాదవ్‌ను ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు.
సిద్దిపేట అభివృద్ధి ప్రస్థానాన్ని, జిల్లాగా ఏర్పడిన తర్వాత జరిగిన ప్రగతిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రూపొందించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు గారి చేతుల మీదుగా కళ్యాణి యాదవ్‌ను సన్మానించి అభినందించారు.


