జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట జిల్లా ప్రతినిధి | ఆగస్టు 15, 2026:

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాలు, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో దేశానికి మంచి పౌరులుగా ఎదిగి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, డీఆర్ఓ రాజేశ్వరి, డిప్యూటీ కలెక్టర్ ఫణి కుమార్, ఏవో అనిల్ కుమార్, జిల్లా పౌర సంబంధాల అధికారి రషీద్, కలెక్టరేట్ కాంప్లెక్స్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

క్యాంపు కార్యాలయం, జెడ్పీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రియాంక తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.