వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో పేదల సంక్షేమానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిచిపోయే విధంగా కోర్టు ఆదేశాలు వెలువడటానికి కారణమైన ప్రభుత్వ చేతగానితనాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ధరూర్ మండలం మాజీ అధ్యక్షులు పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
సోమవారం, 17-08-2026 ఉదయం 9:30 గంటలకు ధరూర్ మండల పరిషత్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల మండల మాజీ అధ్యక్షులు, గ్రామ కమిటీల మాజీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
“ప్రజా సంక్షేమం కోసం ఒక్కటై నిలుద్దాం… పేదల హక్కుల కోసం గళమెత్తుదాం” అని ఆయన అన్నారు.


