యాదగిరిగుట్ట పట్టణంలోని పాత గుండ్లపాల్లి ,అంగడి కింద ఉన్నటువంటి సిసి రోడ్ , అమృత్ వాటర్ పైప్ లైన్ లను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కేంద్రం పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్లు సీసీ రోడ్ ల కోసం తాగునీటి కోసం 40 కోట్లను అమృత్ స్కీమ్ లో భాగంగా కేటాయించడం జరిగింది యాదగిరిగుట్టలో కాంట్రాక్టర్లది ఇష్టారాజ్యంగా నడుస్తుంది వీళ్ళు పెద్ద పెద్ద నాయకులకు బినామీలుగా ఉండి చేసినటువంటి పనులలో నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారు బాయ్స్ హాస్టల్ నుండి స్మశాన వరకు సిసి రోడ్ పోసి ఆరు నెలల సమయం కూడా కాలేదు. అప్పుడే భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి రోడ్డుకు ఇరువైపుల మట్టి ఉపయోగకపోవడం ద్వారా వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవడమే కాకుండా ప్రమాదాలు కూడా జరిగినాయి అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చినటువంటి అమృత్ స్కీమ్ లో భాగంగా 40 కోట్లతో పనులు చేస్తున్నారు ఆ యొక్క కాంట్రాక్టర్ కూడా సిసి రోడ్లు పగలగొట్టి ఏడాది గడుస్తున్నా కూడా ప్యాచ్ వర్క్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అవసరం లేని చోట కూడా సీసీ రోడ్లు పగలగొట్టి పైపులు వేయడం జరిగింది వీళ్లను పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా వ్యవహరిస్తూ వారిచ్చేటువంటి మూటలకు అమ్ముడుపోయి ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం మేల్కొని ఆ యొక్క కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టి బిల్లులు నిలిపియాలని డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్ , బెలిదే అశోక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఆకుల చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శులు నరేష్, సురేష్, ఉపాధ్యక్షులు మిర్యాల కృష్ణ, కర్ణ, దొమ్మాట నరేష్ ,బోడ బుచ్చి బాబు, అలుల దేవేందర్, వంశీ, బుదారం రమేష్, కాలూరి విజయ్ , లక్షయ్య, శ్రీశైలాం, వంశీ, చందు, శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో నాణ్యత లేని పనులు కాంట్రాక్టర్ కు లబ్ది చేకూర్చేలా ఉన్నాయి కర్రే ప్రవీణ్ బీజేపీ
Popular Categories

