నవపక్షం, ప్రకాశం జిల్లా ప్రతినిధి:
ప్రజా మార్పు’ దినపత్రిక మూడో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రకాశం జిల్లా MPTCల సంఘం అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్ దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్, విలేకరులు, పాత్రికేయులు, పాఠకులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ‘ప్రజా మార్పు’ దినపత్రిక ఎడిటర్ అండ్ పబ్లిషర్ చంద్రకు కళ్యాణ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు.
ప్రజలకు మరింత విశ్వసనీయమైన సమాచారాన్ని అందిస్తూ ‘ప్రజా మార్పు’ దినపత్రిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


