నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
అతి త్వరలో జరగనున్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓటరు నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పట్టభద్రుల జేఏసీ చైర్మన్ ఉప్పు సత్యనారాయణ కోరారు. ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమానికి అనూహ్యంగా స్పందన వస్తున్నదని, ఈ ఒరవడిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు చైతన్య కార్యక్రమంలో భాగంగా వనస్థలిపురం లోని ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ లో జయశంకర్ యోగ గ్రూప్ సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉప్పు సత్యనారాయణ మాట్లాడుతూ 6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమానికి అవకాశం ఉంటుందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. విజ్ఞానవంతులైన పట్టభద్రులకు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉండటం శుభ పరిణామమని చెప్పారు. పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే చట్టసభలలో విద్యావంతుల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రిటైర్డ్ పెన్షనర్లు, ఉపాధ్యాయ, ఉద్యోగస్తులకు పిఆర్సి, డిఏలు ఇతర హక్కుల కోసం ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లభిస్తుందని ఉప్పు సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ యోగ గ్రూప్ సభ్యులు
మామిడి కరుణాకర్ రెడ్డి, యోగ మాస్టర్ రామకృష్ణ రెడ్డి, సూరిబాబు, అంపిరెడ్డి, ఆర్ కె, వెంకన్న, అలీం, సత్తయ్య, వేణు, సుధాకర్, రాములు, శ్రీనివాస్ రావు, సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి, సంపత్ రెడ్డి, అశోక్, నీలగిరి ఎక్స్ ప్రెస్ దినపత్రిక సంపాదకులు కండె వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జాతిపిత గాంధీజీ మరియు పూర్వ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతుల సందర్భంగా జయశంకర్ యోగ గ్రూప్ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

