గాంధీ జయంతి సందర్భంగా ఫోనిక్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో క్లీన్ బీచ్ కార్యక్రమం

నవపక్షం, కోట ప్రతినిధి:

నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్‌లోని ఫోనిక్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ శ్రేయ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకొని తుపిలిపాలెం సముద్ర తీరంలో “ఫోనిక్స్ ఆరెంజ్ డే – క్లీన్ బీచ్, క్లీన్ ఫ్యూచర్” కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సముద్ర తీరంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రేయ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజు నిర్వహించే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అలవర్చుకోవాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు.సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల సముద్ర జీవులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు.
చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణ,సామాజిక బాధ్యత, పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు పుస్తకాల ద్వారా విద్యను అభ్యసించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని సూచించారు.
మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దాం” అని ప్రిన్సిపల్ శ్రేయ పిలుపునిచ్చారు.
గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రేయ,సిబ్బంది శ్వేతా,రమేష్, మనోహర్,జూష్ణ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి...

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

Topics

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి:  దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాలలో నూతన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.