మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

నవపక్షం, కోట ప్రతినిధి :

కోట మండలం గూడలి గ్రామంలో మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె మల్లు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ సత్యం, అహింసా మార్గాలను అనుసరిస్తూ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.దండి యాత్ర,సహాయ నిరాకరణ ఉద్యమం వంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస,సమానత్వం, సేవాభావం నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, యువత మహాత్ముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు

Hot this week

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ వస్త్రాల ప్రదర్శన సందర్శించిన లక్ష్మీ భార్గవి దువ్వాడ

నవపక్షం, విశాఖపట్నం ప్రతినిధి : గాంధీ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి – సందీప్ బల్లెం, స్కిలోక్రసీ కో ఫౌండర్

  నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి :  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

స్కిలోక్రసీ ఉద్యమం: డిగ్రీల యుగం నుంచి నైపుణ్యాల యుగానికి : మధుబాబు చికిలే ఫౌండర్ – స్కిలోక్రసీ,

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి ;  ఒక దేశ సంపద కేవలం ఖనిజాలు, పరిశ్రమలు,...

అత్య పాత్య జాతీయస్థాయిలో రాణిస్తున్న దమ్మపేట విద్యార్థులు 

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందినటువంటి...

భువనగిరి రిలయన్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి : భువనగిరి పట్టణంలోని రిలయన్స్ రిటైల్...

Topics

యాదగిరిగుట్ట, కొలనుపాక ఆలయాలను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్

  నవపక్షం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి :  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్....

బేగంపేటలో బాలమల్లు కుటుంబానికి ఆర్థిక సాయం

నవపక్షం, రాజాపేట మండల ప్రతినిధి : రాజాపేట మండలం, బేగంపేట: గ్రామానికి చెందిన...

ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

  నవపక్షం, దేవరకొండ ప్రతినిధి:  దేవరకొండ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో పలు కళాశాలలో నూతన...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.