ప్రభుత్వ సొమ్ముతో వరుణ యాగాలు చేయడం సిగ్గుచేటు – మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నాగార్జునసాగర్‌లో వరుణ యాగం పేరుతో ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు యజ్ఞాలు నిర్వహించడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా విమర్శించారు.

నకిరేకల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అధికారులు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ వరకు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, కనీసం గ్రామాల్లోని చెరువులను కూడా నింపలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

హైదరాబాద్, నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించకుండా తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు అందాల్సిన నీటిని కాపాడాలని డిమాండ్ చేశారు.

గతంలో 2001-02లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రస్తుతం మరోసారి గురు-శిష్యుల పాలనలో కరువు తాండవిస్తోందని చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఇకనైనా కళ్లు తెరిచి రాష్ట్రానికి రావాల్సిన నీటిని రైతాంగానికి అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై విమర్శలు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. హైకోర్టు పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు.

సింగిల్ విండో ఎన్నికలను నామినేషన్ పద్ధతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి తప్పదనే భయంతోనే ఇలాంటి విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు.

విద్యుత్ సరఫరాపైనా మండిపాటు

రాష్ట్రంలో 24, 12, 8 గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో నిరంతర విద్యుత్ సరఫరా లేదని అన్నారు. లైన్ బ్రేక్, ఎల్‌సీ వంటి కారణాలు చూపుతూ ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

దేవుళ్లపై ఒట్టేసి ప్రజలను మోసం చేయడం కాదు… రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు.

Hot this week

నల్గొండలో కూలీ హత్య ఘటన

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్గొండ పట్టణంలోని మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్–6లోని...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

శాలిగౌరారం చెరువు వ్యవహారంపై మత్స్యకారుల ఆందోళన

నవపక్షం , నల్లగొండ జిల్లా ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని చెరువు...

వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన యువ నాయకులు శిగ అభిరామ్ గౌడ్

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలో గణేష్ యువ శక్తి...

పినగాడిలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి ప్రతినిధి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో...

Topics

పినగాడి గ్రామంలో ఘనంగా అన్నసమారాధన కార్యక్రమం

నవపక్షం, పెందుర్తి : పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలోని బీసీ కాలనీలో క్రేజీ...

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం – రామావత్ రమేష్ నాయక్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం...

డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి – సీఐ వెంకట్ రెడ్డి

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి :  విద్యార్థులు డ్రగ్స్‌, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.