నవపక్షం, యాదాద్రి భువనగిరి ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వేదిక కన్వెన్షన్ హాల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక సౌకర్యాలతో కూడిన కన్వెన్షన్ హాళ్లు అందుబాటులోకి రావడం శుభపరిణామమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఇటువంటి వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
రామలింగంపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వేదిక కన్వెన్షన్ హాల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే మౌలిక వసతులు, సామాజిక అవసరాలకు అనుగుణమైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని బీర్ల అయిలయ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, కన్వెన్షన్ హాల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


