దమ్మపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవపక్షం, దమ్మపేట, ఆగస్టు 15:

దమ్మపేట మండలం, దమ్మపేట గ్రామంలోని జనసేన దిమ్మ వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు దేశభక్తి ఉట్టిపడేలా వైభవంగా సాగాయి.

ఈ సందర్భంగా జనసేన నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని, దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

వేడుకల్లో జనసేన వార్డు మెంబర్ సరిత, నాయకులు గోపిశెట్టి శ్యామ్, మల్ల శ్రీను, పోతిని మహేష్, చెన్నకేశవరావు, గుల్లా రాంబాబు, దాసరోజు రామారావు, రంజిత్, కొండపర్వ చిన్న తదితరులు పాల్గొన్నారు.

వీరితో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో దమ్మపేటలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ప్రజలందరికీ నాయకులు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Hot this week

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

Topics

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

  నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.