Sunday, November 8, 2026

మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఘన సన్మానం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి: ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి

నవపక్షం, కేసముద్రం ప్రతినిధి : 

కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల అధ్యక్షుడిగా చిలువేరు సమ్మయ్య గౌడ్ నియమితులైన సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడుతూ, చిలువేరు సమ్మయ్య గౌడ్‌కు ఉన్న ప్రజాసేవ అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని అన్నారు. సీనియర్ నాయకుల సూచనలు, అనుభవాలను తీసుకుంటూ కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

సమ్మయ్య గౌడ్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేయాలి

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, సమ్మయ్య గౌడ్ నాయకత్వంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

సమ్మయ్య గౌడ్‌కు ఉన్న ప్రజాసేవ అనుభవాన్ని పార్టీకి మరింతగా ఉపయోగించుకుని, కేసముద్రం మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సునీత వెంకన్న నాయక్, వైస్ చైర్మన్ అల్లం రామ నాగేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత–దుర్గేష్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ సర్పంచ్ బండారి దయాకర్, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హోలం కృష్ణుడు, వసంతరావు, పోలపాక నాగరాజు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రావుల మురళి, రఫీ, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్కు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.