Sunday, November 8, 2026

గోరికొత్తపల్లి మండలంలో సుల్తాన్పూర్ లో మూడేళ్లు గడిచినా పూర్తికాని రైతు వేదిక బాత్రూములు

సుల్తాన్పూర్ : రైతుల సౌకర్యార్థం నిర్మించిన రైతు వేదికకు మూడేళ్లు పూర్తయినా, అక్కడ నిర్మించిన బాత్రూములు మాత్రం ఇప్పటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. బాత్రూముల నిర్మాణం పూర్తికాకపోవడంతో రైతులు, రైతు వేదికకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బాత్రూముల నిర్మాణం కోసం గోడలు నిర్మించినప్పటికీ తలుపులు, ఇతర అవసరమైన పనులు పూర్తి చేయకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. మరోవైపు రైతు వేదిక పరిసరాల్లో పరిశుభ్రత లోపించడంతో చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా మారింది.మూడేళ్లు గడిచినా పనులు ఎందుకు పూర్తికాలేదని, నిధులు కేటాయించినా పనులు నిలిచిపోవడానికి కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాత్రూముల నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Hot this week

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Topics

తొలి రాజకీయ అడుగులోనే ఘన విజయం.. 438 ఓట్ల మెజారిటీతో చిల్ల శ్రీనివాసరెడ్డి గెలుపు!

  నవపక్షం, రణస్థలం ప్రతినిధి: రాజకీయాల్లోకి తొలి అడుగులోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు చిల్ల...

పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీల పంపిణీ

  నవపక్షం, మర్రిగూడ ప్రతినిధి :  పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ &...

కళ్యాణి యాదవ్‌కు హరీశ్ రావు అభినందన

నవపక్షం, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన...

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,...

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఆరిఫుద్దీన్ కల్వకుర్తి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ప్రముఖ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలి – నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

నవపక్షం, బచ్చన్నపేట ప్రతినిధి : బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన వేముల...

అవల్గావ్‌లో వైభవంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

    మద్నూర్, నవపక్షం: మండలంలోని అవల్గావ్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం...

ఐఐఐటీడీఎంలో విద్యార్థిని బలవన్మరణం.. స్వగ్రామంలో విషాదం

  నవపక్షం, నర్సంపేట ప్రతినిధి: వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామ...

Related Articles

Popular Categories

Previous article
గురుకుల పాఠశాలలో విద్యార్థుల భద్రతకు భంగం కలిగితే సహించేది లేదు 8వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కేవీపీఎస్, ప్రజాసంఘాల డిమాండ్ తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల (పెద్దేముల్)లో చోటుచేసుకున్న ఘటనపై కేవీపీఎస్, విద్యార్థి, మైనారిటీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం తాండూరు ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు చపాతీలు కాల్చే కర్రతో దాడి చేసి వాతలు పెట్టడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. విద్యార్థిని తోటి విద్యార్థులు పలుమార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. “గురుకులం అంటే విద్యార్థులకు భద్రత, విద్య, సంరక్షణ కల్పించే ప్రదేశం. అక్కడే విద్యార్థులపై దాడులు జరిగి, ఫిర్యాదులను గోప్యంగా ఉంచే పరిస్థితి ఉంటే అది విద్యా వ్యవస్థకే అవమానం. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే ఏ అధికారి అయినా బాధ్యత నుంచి తప్పించుకోలేరు.” అని నాయకులు స్పష్టం చేశారు. ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగా, వారిని లోపలికి అనుమతించకుండా గేట్లు మూసివేశారని తెలిపారు. ఈ ఘటనపై తాండూరు పట్టణ ఎస్సై, సిబ్బంది పాఠశాల వద్దకు చేరుకున్నప్పటికీ, విద్యార్థి తల్లిదండ్రులతో పాటు పోలీసులను కూడా లోపలికి అనుమతించకుండా గేటుకు తాళం వేయడం పట్ల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలోనే కేవీపీఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలో సర్వే నిర్వహించి అనేక సమస్యలను గుర్తించామని, వాటిని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని నాయకులు తెలిపారు. పాఠశాలలో సీనియర్లు జూనియర్లను వేధించడం, విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యలు, రాత్రి వేళల్లో విద్యార్థులు బయట తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. అదేవిధంగా, ప్రతి ఆదివారం విద్యార్థులతో చపాతీలు తయారు చేయించడం, ఇతర వంట పనులు చేయించడం వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, విద్యార్థుల నుంచి పనులు చేయించడంపై వర్తించే చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “విద్యార్థుల చేత చదువు చెప్పించాల్సిన వయసులో వంట పనులు చేయించడం ఎందుకు? విద్యార్థుల భద్రత, హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు గురుకుల పాఠశాలను సందర్శించి, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడులు, వేధింపులు, ర్యాగింగ్‌కు కారణమైన వారితో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై కూడా నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, కేవీపీఎస్, విద్యార్థి, మైనారిటీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, ఎస్సీ, ఎస్టీ ఎంహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, కేవీపీఎస్ నాయకులు పిట్ల నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
Next article
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.