బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాడాలి సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి: 

దేవరకొండ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వివిధ రంగాల్లో సేవలందిస్తున్న సామాజిక కార్యకర్తలు, మహిళలు, మేధావులు, కార్మికులు, కర్షకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారం కోసం బహుజనులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాలను ఏకం చేసి బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప నాయకుడని కొనియాడారు. గోల్కొండతో పాటు 18 దుర్గాలను పాలించిన బహుజన చక్రవర్తిగా చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. పాపన్న స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్ నేత, చోల్లేటి భాస్కరాచారి, డాక్టర్ ఏకుల రాజారావు, ఉప్పల శీను నేత, దబ్బీకార్ పెంటోజి, ఏరుకొండల రాము, మునగాల గణేష్, పున్న బిక్షమయ్య, ముక్కామల బాలయ్య, శవ్వ నారాయణ యాదవ్, పోతాం సహదేవ్, కుంభం బాలచందర్ గౌడ్, ఇంద్రకంటి ఈదయ్య గౌడ్, నాగిళ్ల క్రిష్టఫర్, బోయపల్లి చంద్రమౌళి, ఏకుల సురేష్, ఎండి అబ్దుల్ సత్తార్, అబ్దుల్ కలాం, తోటపల్లి శీను, రాచమల్ల నాగయ్య, కానుగుల చంద్రశేఖర్, కాటం గోవర్ధన్, ఎరుకల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.