నవపక్షం ,చౌటుప్పల్, ఆగస్టు 20:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ సమక్షంలో ఏఈఓ వీణ రైతులతో సమావేశమై పంటల సాగుపై అవగాహన కల్పించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగుతో ఆశించిన దిగుబడులు రాకపోయే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని ఏఈఓ వీణ సూచించారు. కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగ, ఉలవలు, కూరగాయలు వంటి పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు, సత్వర లాభాలు పొందవచ్చని వివరించారు.
సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ రైతులు తమ భూములను ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పంట తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. వ్యవసాయ భూములను సాగులో ఉంచడం ద్వారా ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకులారం మల్లారెడ్డి, దొడ్ల సెట్టయ్య, పర్ని రామచంద్రరెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, భీమగోని బాలరాజ్, మోడెపు నరసింహ, పెంటయ్య, జంగయ్య, ముద్దం సెట్టయ్య, వెంకటేశం, శ్రీను ముత్యాలు, సుర్వి లచ్చయ్య, రాములు, దాసు, గంగిరెడ్డి అంజిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఇమ్మడి ఏసుదాస్, ఇరగదిండ్ల ఈద్దయ్య, కే. యాదిరెడ్డి, కే. జంగారెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.


