నవపక్షం, మొగుళ్లపల్లి ప్రతినిధి :
మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం నాయకులు వాకిటి రాజు తాత మోరే రాఘవ రెడ్డి ఇటీవల పరమపదించారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపయ్య వారి నివాసానికి వెళ్లి, మోరే రాఘవ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, రాఘవ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి, మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు మోరే వేణుగోపాల్ రెడ్డి, రేగొండ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


