నవపక్షం, చౌటుప్పల్ ప్రతినిధి :
గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకునే ఉద్దేశంతో దివీస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు ఈరోజు గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల భవనాలు, పద్మశాలి కాలనీలో ఏర్పాటు చేయాల్సిన నూతన వాటర్ ఫిల్టర్ ప్లాంట్, అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఓపెన్ జిమ్ తదితర పనులు చేయుటకుదివీస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి శివకృష్ణ పరిశీలించారు. గ్రామ ప్రజలకు ప్రస్తుతం ఉన్న అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై గ్రామ ప్రజలు మరియు ప్రజాప్రతినిధులతో చర్చించారు.
గ్రామ అవసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, అవసరమైన అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని దివీస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా విద్య, తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
దివీస్ మేనేజ్‌మెంట్ గ్రామానికి వచ్చి ప్రజల అవసరాలను స్వయంగా తెలుసుకోవడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అవసరాలను గుర్తించి, త్వరలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న దివీస్ మేనేజ్‌మెంట్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చిన్నం బాలరాజు, దివీస్ మేనేజ్‌మెంట్ ప్రతినిధి శివకృష్ణ, వార్డు సభ్యులు గుర్రం ప్రమోద్ కుమార్, దబ్బటి ఉపేందర్, పార శ్యామ్, మాజీ సర్పంచ్ తాడక రామాంజనేయులు, చౌట వేణు గోపాల్, మాజీ ఎంపీటీసీ బత్తుల శంకర్, మాజీ ఉప సర్పంచ్ బుట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
అలాగే గ్రామ ప్రముఖులు బుట్టి కృష్ణ, పబ్బతి వెంకటయ్య, పబ్బతి అంజయ్య, యనమల సంజీవ, తడక శ్రీనివాస్, గుర్రం శ్రీనివాస్, గుర్రం నర్సింహ, శ్రీరాములు, తడక ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి, వాటిని త్వరలో కార్యరూపంలోకి తీసుకురావడం ద్వారా గ్రామానికి మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.


