నవపక్షం, మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి :
పేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ప్రభుత్వ బీఎడ్ విద్యార్థి, గిరిజన శక్తి తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నాయక్ రూ.50 వేల ఆర్థిక సాయం అందించి తన సేవాభావాన్ని చాటుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొండయ్య తన కుమార్తె వివాహాన్ని సెప్టెంబర్ 3న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వివాహం నిర్వహించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని కొండయ్య మిత్రుడు సచిన్ కార్తీక్ నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయం తెలుసుకున్న కార్తీక్ నాయక్ వెంటనే స్పందించి, తక్షణ సహాయంగా రూ.50,000 నగదును అందజేశారు. పేద కుటుంబానికి అండగా నిలిచి, మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా కార్తీక్ నాయక్ మాట్లాడుతూ, రాఖీ పండుగ రోజున ఒక చెల్లి వివాహానికి ఆర్థిక సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కరోనా మహమ్మారి (COVID-19) కాలం నుంచి అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు చిన్నచిన్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థి రమేష్ పాల్గొన్నారు.


