మక్తల్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నవపక్షం, నారాయణపేట జిల్లా ప్రతినిధి :

మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

ముందుగా మక్తల్ మండలం గొల్లపల్లి సమీపంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అదే ప్రాంతంలో ఆర్టిఫిషియల్ విభాగానికి 9 ఎకరాలు, సెట్విన్‌కు 10 ఎకరాల 30 గుంటలు, ఏటీసీకి 1.5 ఎకరాలు, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్‌కు 20 గుంటల స్థలాన్ని కేటాయించినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం మక్తల్‌లో కొనసాగుతున్న ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

పన్నుల వసూళ్లలో జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

అనంతరం మక్తల్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పట్టణంలో ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్ల పరిస్థితిని సమీక్షించారు. పన్నుల వసూళ్లలో జాప్యం జరుగుతుండటంపై మున్సిపల్ కమిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.

పట్టణంలోని పలుచోట్ల చెత్త పేరుకుపోయిన విషయాన్ని గమనించిన కలెక్టర్ పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించి పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ వాహనాలు నిర్దేశిత ప్రాంతాల్లో సక్రమంగా తిరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని జీపీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది హాజరు పర్యవేక్షణకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలోని వార్డు అధికారులు, మొత్తం వార్డుల సంఖ్య, ఇతర పరిపాలనా అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనుల పరిశీలన

అనంతరం మక్తల్ సమీపంలోని 916/2, 917/2 సర్వే నంబర్లలోని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో రూ.35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన A, B, C, D బ్లాక్‌ల పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. మిగిలిన పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి ఆస్పత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా, నిర్దేశిత గడువును తప్పనిసరిగా పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస, మున్సిపల్ కమిషనర్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.