నవపక్షం, చౌటుప్పల్, ఆగస్టు 31:
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామ బొడ్రాయి, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలను ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా మత్స్య సహకార శాఖ అధ్యక్షులు పాశం సంజయ్ బాబు, స్థానిక కౌన్సిలర్ బద్రి గాలయ్య, మాజీ సర్పంచ్ కానుగు యాదమ్మ బాలరాజు, నాయకులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్, నందగిరి భీమయ్య, ఊదర వెంకటేష్ మహాజన్, దేశట్ల భిక్షం యాదవ్, చుక్క యాదయ్య, పాలెం అశోక్, ఎర్ర స్వామి, గుండబోయిన యాదయ్య, పాశం రాజేష్, గోపనబోయిన వెంకటేశం, గోపనబోయిన యాదగిరి, కానుగు శివ, గొడుగు యాదయ్య, బద్రి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


