భారత్‌లో తొలిసారిగా ‘అగ్రి డాక్టర్ ఉద్యమానికి’ నాంది

నవపక్షం, వ్యవసాయ విభాగం ప్రతినిధి :

వ్యవసాయ ఆధునిక వృత్తి అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, రైతులకు క్షేత్రస్థాయిలో నాణ్యమైన సాంకేతిక మార్గదర్శనం అందించే నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో నవ నిర్మాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’ను ఆదివారం కుత్బుల్లాపూర్ బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఘనంగా నిర్వహించారు. భారతదేశంలోనే తొలిసారిగా ‘అగ్రి డాక్టర్ ఉద్యమం’కు ఈ సదస్సు ద్వారా నాంది పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది, వెన్నెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుంకర నరేష్ హాజరై మాట్లాడారు. తాను రైతు బిడ్డగా, రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలిసిన వ్యక్తిగా ఈ వేదికకు వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రైతులు కూడా సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో ఎండ్రిన్ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల వినియోగంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు అందించేందుకు శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన వ్యవసాయ నిపుణుల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా శాస్త్రీయ వ్యవసాయ సమాచారాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ఇంటర్నెట్‌లో ‘రైతు’ అని వెతికితే బక్కచిక్కిన రైతు ఆకాశం వైపు చూస్తున్న దృశ్యమే కనిపించే పరిస్థితి మారాలని సుంకర నరేష్ అన్నారు. రైతు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి అభివృద్ధి సాధిస్తున్న వ్యక్తిగా ప్రపంచానికి కనిపించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత, పరిశోధన, ఆధునిక విధానాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని తెలిపారు.

యువత వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ కోర్సుల వైపు మరింతగా ఆకర్షితులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ విద్యను కేవలం ఉద్యోగానికే పరిమితం చేయకుండా రైతులకు సేవ చేయడంతో పాటు స్వయం ఉపాధి, అగ్రి బిజినెస్, అగ్రిటెక్, సాంకేతిక వ్యవసాయం తదితర రంగాల్లో ఉన్న విస్తృత అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు.

సదస్సులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన 24 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, అభ్యుదయ రైతులు, అగ్రి బిజినెస్ ప్రతినిధులు, వృత్తి మార్గదర్శకులు పాల్గొన్నారు. వ్యవసాయ విద్యార్థులు, యువ వ్యవసాయ నిపుణులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికత, అగ్రి బిజినెస్, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి మార్గాలు, రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు అందించే విధానాలపై వారు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది వ్యవసాయ విద్యార్థులు, యువ వ్యవసాయ నిపుణులు పాల్గొని రంగ నిపుణుల సూచనలు, మార్గదర్శకాలను పొందారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భవిష్యత్‌లో అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయ రంగంలో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

వ్యవసాయ రంగంలో విద్యావంతులైన యువతకు కొత్త అవకాశాలను పరిచయం చేయడంతో పాటు, రైతుల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపగల ‘అగ్రి డాక్టర్లను’ తయారు చేయడమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. రైతు సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని, శాస్త్రీయ పరిజ్ఞానంతో సరైన పరిష్కారాలు సూచించే నిపుణుల అవసరం ప్రస్తుతం మరింత పెరిగిందన్నారు. రైతు–వ్యవసాయ నిపుణుల మధ్య సాంకేతిక వారధిని బలోపేతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని నవ నిర్మాణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు రాంబాబు పొన్నాన, ఉపాధ్యక్షురాలు అడ్వకేట్ సాయి జ్యోతి, యు. జగదీశ్వరరావు పొన్నానతో పాటు సంస్థ సభ్యులు సమన్వయంతో నిర్వహించారు. వ్యవసాయ విద్యార్థులు, యువ నిపుణులకు వృత్తిపరమైన దిశానిర్దేశం అందించిన ‘ది ఫార్మిస్ట్ సమ్మిట్–2026’ వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, యువతకు కొత్త అవకాశాలకు వేదికగా నిలిచింది.

Hot this week

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజీవ్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ డాక్టర్ మాధవరెడ్డి సహకారంతో ఆర్థిక సహాయం

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23  ఖైతాపురం గ్రామంలో రాజీవ్ స్మారక పౌండేషన్ ట్రస్ట్...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.