నవపక్షం, సికింద్రాబాద్ ప్రతినిధి :
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
వారాసిగూడ నుంచి సీతాఫల్‌మండి వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు తీగుళ్ల రామేశ్వర్‌తో కలిసి బీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు సమీనా మహ్మద్ ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం సరికాదని బీఆర్‌ఎస్ నాయకులు అన్నారు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను తక్షణమే అమలు చేసి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.


