నవపక్షం, తెలంగాణ భవన్ ప్రతినిధి :
అమెరికా పర్యటన అనంతరం తెలంగాణ భవన్‌కు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యురాలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సుమిత్ర ఆనంద్ కేటీఆర్‌కు రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావానికి ప్రతీకగా రాఖీ కట్టి ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ చేస్తున్న పోరాటాలు, పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న నాయకత్వం అభినందనీయమని సుమిత్ర ఆనంద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


