నవపక్షం, సూర్యాపేట జిల్లా ప్రతినిధి :
గీత కార్మికులు కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను సద్వినియోగం చేసుకుని తమ ప్రాణాలను కాపాడుకోవాలని తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ అన్నారు.
బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గౌడ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు జలంధర్ గౌడ్ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షణ కిట్ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులు తాటి చెట్లను ఎక్కే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్లను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. రక్షణ పరికరాలను సక్రమంగా ఉపయోగించడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చని అన్నారు.
కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ మణికంఠ నాగేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అంజయ్య, గీత కార్మికులు యాదగిరి గౌడ్, ఎల్లయ్య, నరేందర్, సురేందర్, అంజయ్య, యాదగిరి, వెంకన్న, సైదులు తదితరులు పాల్గొన్నారు.

