నవపక్షం, తుంగతుర్తి, సెప్టెంబర్ 2:
తుంగతుర్తి, సెప్టెంబర్ 2: శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్ గ్రామానికి చెందిన ఇంద్రకంటి శ్రీను మాతృమూర్తి ఇంద్రకంటి సోమమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్‌తో కలిసి ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సోమమ్మ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


