నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 3:
మిర్యాలగూడలో నిర్వహించనున్న సభకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) కు చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
చౌటుప్పల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద మునుగోడు మాజీ ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేటీఆర్‌ను శాలువాతో సత్కరించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కౌన్సిల్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ శేఖర్, 15వ వార్డు కౌన్సిలర్ గడ్డం ఇందిరా రాజరత్నం, చౌటుప్పల్ మున్సిపల్ కన్వీనర్ భూమి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచులు, మండల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.


