ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల చేయాలి – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నవపక్షం, పెద్ద వంగర మండల ప్రతినిధి :
ఎస్సారెస్పీ కాల్వ ద్వారా చెరువులకు, పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పెద్దవంగర మండలం సబ్ కెనాల్ నుంచి కిష్టు తండా వరకు ఎండిపోయిన ఎస్సారెస్పీ ఫేజ్-2 కాలువ వెంబడి పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఎస్సారెస్పీ కాల్వలకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కండ్ల ముందే వందల ఎకరాల్లో పంటలు సాగు చేయకుండా రైతులు భూములను పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాకాలంలో కాల్వకు నీరు వస్తుందనే ఆశతో రైతులు వరి నాట్లు వేశారని, ఇప్పుడు నీరు అందకపోతే ఎకరాకు సుమారు రూ.25 వేల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. రైతులు పంటల కోసం పెట్టిన పెట్టుబడులు భారంగా మారుతున్నాయని తెలిపారు.

మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రోజుకో సభ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

ఇప్పటికే రైతుబంధు విషయంలో రైతులకు అన్యాయం జరిగిందని, యూరియా కొరత, విద్యుత్ సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పంట రుణమాఫీ సక్రమంగా అమలు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతు బీమా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

పంటలకు సాగునీరు అందిస్తే పంటలు పండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రైతులకు నీటిని విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పండిన పంటకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతులను ఆదుకోవాలని, ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే గద్దె దిగిపోవాలని ఆయన అన్నారు.

కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలి

పేదింటి ఆడబిడ్డ పెళ్లి కుటుంబానికి భారం కాకూడదనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కల్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.

కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి. తులం బంగారం హామీని అమలు చేయాలి. లేకపోతే మహిళలు, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు అని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెద్దవంగర మండల నాయకులు, వివిధ గ్రామాల రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.