ములకలపల్లి – నవపక్షం :-
రూ 5 లక్షల ఆర్థిక సహాయం ఇంటిస్థలం ఇందిరమ్మ ఇల్లు మంజూరు
ఆసుపత్రి నిర్లక్ష్యంపై చర్యలు నిందితులకు కఠిన శిక్ష
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి ఊకె శిరీష గారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు.ఇటీవల హైదరాబాద్ లోని ప్రైమ్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్న శిరీష హత్యకు గురై మృతి చెందిన తరుణంలో
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గజిల్లా కలెక్టర్ అంకిత్ తో కలిసి చౌటిగూడెం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకొని వారికి ధైర్యం చెప్పారు
ప్రభుత్వం ప్రకటించిన రూ 5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు అదేవిధంగా ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థలంతో పాటు ఇంటిని మంజూరు చేసి పట్టాను అందించారు శిరీష మృతి ఘటనలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు విచారణలో ఆసుపత్రి నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు శిరీషను హత్య చేసిన నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామన్నారు ధైర్యం గా ఉండాలని ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు


