నవపక్షం, మొయినాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ (MRPS) నూతన మండల కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా మొయినాబాద్ మండల కేంద్రంలోని ఎంఎస్ఎస్ గార్డెన్స్‌లో ఎమ్మార్పీఎస్ (MRPS) మరియు అనుబంధ విభాగాల మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇంచార్జి కొండిగారి మహేందర్ మాదిగ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మొయినాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా సురంగల్ గ్రామానికి చెందిన రామగళ్ళ కుమార్ మాదిగను, MSP మండల అధ్యక్షుడిగా హిమాయత్‌నగర్ గ్రామానికి చెందిన దర్గుపల్లి రాజు మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MRPS రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ళ ఉపేందర్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యమ ఆవశ్యకత, ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిణామాలు, భవిష్యత్ లక్ష్యాలు, నాయకుల కర్తవ్యాలపై వివరించారు. అలాగే మందకృష్ణ మాదిగ సందేశాన్ని నాయకులు, కార్యకర్తలకు వివరించారు.
మాదిగలు సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకొని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఐక్యంగా ఉద్యమించాలని ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు. దండోరా ఉద్యమాన్ని ప్రతి మాదిగ వాడకు చేర్చి, చదువుకున్న యువతను చైతన్యవంతం చేసి జాతికి నాయకత్వం వహించేలా తీర్చిదిద్దాలని, సమసమాజ స్థాపన లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు రావుగళ్ళ బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ మాదిగ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఏడి, ఎంఇఎఫ్ నాయకులు శ్రీనివాస్, చేవెళ్ల ఇంచార్జి బ్యాతాల శివశంకర్ మాదిగ, ఊరంట ప్రవీణ్ మాదిగ, మల్లేష్ మాదిగ, బోడ భాస్కర్ మాదిగ, సిరిగిరి కృష్ణ మాదిగతో పాటు మొయినాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


