నవపక్షం, చేవెళ్ల ప్రతినిధి :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ మహా ధర్నా నిర్వహించనున్నట్లు చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ గత 1000 రోజులుగా ప్రజా జీవితానికి, అసెంబ్లీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే జీతం తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తించకుండా ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నిర్లక్ష్యమని పేర్కొన్నారు.
తేదీ: 06-09-2026, ఆదివారం
సమయం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: ఇందిరా పార్క్ ధర్నా చౌక్, హైదరాబాద్
ఈ మహా ధర్నాకు చేవెళ్ళ నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్స్ , మున్సిపల్ ప్రెసిడెంట్స్, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, SC సెల్, ST సెల్, మైనార్టీ సెల్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల శ్రేణులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పామేన భీమ్ భరత్ పిలుపునిచ్చారు.


