నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి :
దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి పండగ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మ తల్లిని పలువురు గ్రామ ప్రముఖులు, యాదవ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు,యువకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు జబ్బు అంజయ్య యాదవ్, ఉపసర్పంచ్ కడారి సైదులు యాదవ్,గుండాల వెంకట్ యాదవ్, వార్డు సభ్యులు జక్కుల అంజి యాదవ్, జబ్బు వెంకన్న యాదవ్, వర్రె వెంకటయ్య యాదవ్, గుంటోజు రాజు, వర్రె శంకర్ యాదవ్, మూడిగ శివ యాదవ్, బైకని అంజి యాదవ్, కడారి ఆనంద్ యాదవ్, వలముల వంశీ యాదవ్,కడారి తిరుపతయ్య మట్టిపల్లి వెంకటయ్య,
తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
పెద్దమ్మ తల్లి పండగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.


