నవపక్షం, హైదరాబాద్:
సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీలో ఉన్న కృషి హై స్కూల్‌లో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ, సమాజంలో కుల, మత, ప్రాంత, లింగ తదితర ఎలాంటి వివక్షనైనా ఎదుర్కొనేందుకు చదువే ప్రధాన ఆయుధమని అన్నారు. విద్య ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుందని, అక్షరానికి పుట్టుకే కానీ మరణం లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్యామ్ ప్రసాద్, వెబ్ట్రైక్స్ సందీప్ కుమార్ బల్లెం, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించి, అక్షరాస్యత ద్వారా సమాజంలో సమానత్వం, చైతన్యం పెంపొందించాల్సిన అవసరాన్ని కార్యక్రమంలో తెలియజేశారు.


