నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి :
మల్లన్న గారి ఆదేశాలు మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రాష్ట్ర పార్టీ సూచనల మేరకు, మల్లన్న పై రెడ్డి జాగృతి సంస్థకు చెందిన వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు మద్నూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్కి పార్టీ నాయకులు, కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజా జీవితంలో ఉన్న నాయకులపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మల్లన్న పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి, సంబంధిత అంశాలను పరిశీలించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో TRP మండల ప్రెసిడెంట్ కాంబ్లే మిలింద్, పార్టీ కార్యకర్తలు ఖండేరావు, రాజ్‌పాల్ పాల్గొని, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.


