నవపక్షం, నాంపల్లి, సెప్టెంబర్ 11:
నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలను ఎంఈఓ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు కూడా విద్యార్థుల్లో ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ప్రతి సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించే క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
మండల స్థాయి పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో తదితర క్రీడలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నాంపల్లి మండలంలోని నాంపల్లి, పసునూర్, ముష్టిపల్లి, మోడల్ స్కూల్, కేజీబీవీ, గాంధీజీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి, ఎంపికైన విద్యార్థుల జాబితాను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పీడీలు జి. సైదులు, డి. నిర్మల, ముష్టిపల్లి హైస్కూల్ ఉపాధ్యాయులు బి. దామోదరచారి, విష్ణు నారాయణ, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


