నవపక్షం, నిజాంపేట్ ప్రతినిధి :
బీజేపీ నిజాంపేట్ సర్కిల్ ఆధ్వర్యంలో, జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “బీజేపీ జన బాట” కార్యక్రమం మధురానగర్ కమాన్ నుంచి ప్రశాంతి హిల్స్ మీదుగా ఇంద్రన్న కాలనీ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా స్థానికులు రహదారుల గుంతలు, అనవసర స్పీడ్ బ్రేకర్లు, డ్రైనేజీ పొంగిపొర్లడం, చెత్తాచెదారం తదితర సమస్యలను బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజా సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కాలనీ వాసులతో కలిసి నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు, బిక్షపతి యాదవ్, డాక్టర్ ఎంఆర్ఎస్ రాజు, మైలారం అశోక్, గజ్జెల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


