నవపక్షం, మద్నూర్ మండల ప్రతినిధి :
హిప్పర్గ గ్రామంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఓటర్లకు నోటీసులు అందజేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) భీమ్ రావు మరియు సైలూ ఆధ్వర్యంలో గ్రామస్థులకు ఓటరు జాబితాకు సంబంధించిన నోటీసులు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడటంలో మరియు ఓటరు జాబితాలో పేరు నమోదు, సవరణల ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు క్రియాశీలకంగా పాల్గొంటూ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సిబ్బంది మరియు గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు.


