నవపక్షం, ఘట్కేసర్ ప్రతినిధి :
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ డివిజన్‌లో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.
వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


