నవపక్షం, నల్లగొండ మండల ప్రతినిధి :
నల్లగొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో తులసి హాస్పిటల్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు వైద్య సలహాలు అందించారు.
ఈ సందర్భంగా వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై వైద్య సేవలను వినియోగించుకున్నారు.
కార్యక్రమంలో సర్పంచ్ గుండబోయిన వెంకన్న, ఉపసర్పంచ్ రొయ్య బద్ద్రి, సైదిరెడ్డి, చిన్న సైదులు, తులసి హాస్పిటల్స్ డాక్టర్ ఎం. సంతోష్ రెడ్డి, డాక్టర్ వెంకట్, హాస్పిటల్ మేనేజర్ బొడ్డు వంశీ, మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు.


