నవపక్షం, గాజులరామారం డివిజన్ ప్రతినిధి :
శ్రీరామ్ నగర్‌లో బాలల వానర సైన్యం ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమం నిర్వహించారు. గల్లీలోని బాలలు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సేకరించిన చందా డబ్బులను సద్వినియోగం చేస్తూ విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా గల్లీలోని బాలలందరికీ పరీక్ష కిట్లు, ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, షార్పెనర్ తదితర సామగ్రిని పంపిణీ చేశారు. పండుగ సందర్భంగా సేకరించిన చందా డబ్బులను విద్యార్థుల చదువుకు ఉపయోగపడే విధంగా వినియోగించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాలల వానర సైన్యం సభ్యులు రేవంత్ రెడ్డి, సుశ్రీత్ బాబు, రిషి తదితరులు పాల్గొన్నారు. బాలల్లో సేవాభావం, సామాజిక బాధ్యతతో పాటు విద్యపై ఆసక్తిని పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు.
